పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

28


ఆచారంమాయింటి ఆడపడుచులకు
ఆజ్ఞల్లు మాయింటి కోడళ్ళకగును.

39.
తొల్లింటి కాలమ్ము దొడ్డ కాలమ్ము
అత్తవచ్చి కోడలికి దండమ్ము పెట్టె
“చాలుచాలత్తయ్య చాలత్తగారు !
నీకొడుకు వెయ్యేళ్లు (య్యిళ్ళ?) మొదలు కావాలి
నీకోడలు పట్టంపు దేవికావాలి
నువ్వెళ్లి పంచల్ల పాలు కావాలి.”

40.
రోటిక్కి మిక్కిలి వాయిపోనేరు
వాడచేడెల్లార ! తోడాయి పొండి,
ఓవాడ చేడెమ్మ అబ్బాయిలక్ష్మి
పుస్తెల్లు మెరియంగ పునిస్త్రి తోడాయె
ఓవాడ చేడెమ్మ అబ్బాయిలక్ష్మి
నానుపేట మెరియంగ నాతి తోడాయె
ఓవాడ చేడెమ్మ అబ్బాయిలక్ష్మి
కంకణాలు మెరియంగ కాంత తోడాయె.

41.
వండవు వార్చవు వంటిల్లు చొరవు
వనిత నీ వజ్రాలకొంగేల మాసు ?
పణతిరో అబ్బాయి పుట్టేడు మొదలు
పణతి అమ్మికొంగు పసువుల్ల మాసు ?
కాంతరో అబ్బాయి పుట్టేడు మొదలు
కాంత అమ్మికొంగు కాటుకులమాసు ?