పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

27


సీతకాలంవచ్చె చీరల్లు చిరిగె
సీత నీపుట్టింటి వారేలరారు?
మారుకాలంవచ్చె మడతల్లు చిరిగె
మగువ నీ పుట్టింటి వారేలరారు?

36.
వైశాఖమాసాన వారింట పెళ్ళి
వల్లభుడుఅన్నయ్య పెళ్ళిచేయించె
మిళ్ళి తడియకుండ బొట్టుపడకుండ
నేర్పుతో పెద్దవదినె నేతులొడ్డించె.
అంతకంటె నేర్పరే చిన్నన్న వదినె
ఆకాశాన మిళ్ళి ఆడించిపోయె.

37.
"పండూగవచ్చింది ఓఅత్తగార !
పిండిక్కి బియ్యమ్ము ఎన్ని పోసీది ?”
“కొట్టెక్కి తెచ్చియు వెయ్యవే చేడె
తలగోసి తవ్వెడు పొయ్యిబియ్యమ్ము ”
పిండిదంపి వాని అత్త పిలవనంపింది
రానన్ని అల్లుడు రచ్చకొమ్మెక్కె
పిలవనని వానిమామ పీటకొమ్మక్కె
పోనన్నిపండుగ పొదికట్టియుండె.

38.
పుణ్యమ్ముఒకచోట బుద్ధివొకచోట
ఆచారమొకచోట ఆజ్ఞ యొక చోట
పుణ్యమ్ముమాయింటి పెద్దలకువచ్చు
బుద్ధులకు మాయింటి బాలలకువచ్చు.