ములో జటిలమైన ఆలంకారాలు, భాష ఏమి ఉపయోగి స్తవి? అలా కాకుండా వాళ్ళకే అందుబాటులో వుండేట్టు ప్రసంగిస్తే కవి కృత కృత్యుడు అవుతాడు. కొని
ప్రస్తుతం ఈగ్రంథకర్త అనేక పాతపాటలను సేకరించి నేర్పుతో వర్గీకరణము చేసి జనబాహుళ్యానికి అందజేస్తున్నారు. ఈ గ్రంథంలో ఉన్న మొదటి రెండు ఖండాలలోను జోలపాటలు, ఆటపాటలు, పణతి పాటలు, మిశ్రమములు అనేక రకాలు వున్నాయి. మూడో ఖండంలో మాత్రము ఇలాంటి విభజన లేదు. దానికి కారణము సంఖ్య తక్కువగా వుండటం అని తోస్తుంది. ఈ పాట అన్నిటిలోను తెలుగునాటి తెలుఁ గుల నిత్యజీవితము ద్యోతని వుతోంది. తేనె తెనుఁగు నిరాటంకముగా స్రవిస్తోంది. ఈ పాటలు తెలుగుతల్లులు నేర్చేవుంటారు. నాగరిక తా విజృంభణమువల్ల ఇలాంటి అమూల్యమైన సారస్వతము వెనక బడకుండా వుండటానికి ఈ ప్రయత్నము. ఈ పాటలు అ నేకచోట్ల నుండి సేకరించినవి కాబట్టి ఒక్కొక్కదానికి ప్రత్యేక శీర్షిక లేదు. కొన్ని అసంపూర్తిగాకూడా ఉన్నాయి. ఈ సారస్వతము బాగా వృద్ధిపొందాలి. నేదునూరి గంగాధరం మొద లై నవారు ఇప్పటికే కామేశ్వరరావుగారి ప్రోత్సాహమువల్ల చాల కృషి చేస్తున్నా రని తెలుస్తూంది. మొదటి రెండుఖ డాలలో వున్న తెనుగుకీ చివర ఖండంలో వున్న తెనుగికి కొంచెం భేదము కనుపిస్తోంది. దీనికి కారణము మూడోఖండలోని పాటలు తెలింగాణములో స్వీకరించినట్లు గ్రంథకర్త సూచించాడు. అందుక నే తెలింగాణా తెలుగు ఛాయలు ఈ పాటలలో అక్కడక్కడ తొంగిచూస్తున్నాయి.
ఈ పాటల్లో రసౌన్నత్యానికి ప్రధానమైనపంక్తులు ఉదహరించా లంటే మొత్తము గ్రంధమంతా ఉదహరించవలసి వస్తుంది. ఈ ఖండిక అన్నింటిలోను నాజూకు అయిన భావాలు హృదయానికి నాటే భాషలో కవితా సౌరభాన్ని వెదజల్లుతున్నాయి. కనుక సొంపైన భావాలు, ఇంపైన భాష అంటే సరిపోతుంది.