పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

2322.
చల్ల చెయ్యిగొల్ల భామ నీ
సందిటిదండలు కదిలేను
వెన్న చెయ్యి అమ్మాయి నీ
వెండిమురుగులు కదిలేను
పాలు తాగు అబ్బాయి నీ
పమిడిమురుగులు కదిలేను.

23.
చెప్పుకో చెప్పుకో
చెవులెక్క తీసుకో
మామిడాకిస్తాను మందెట్టుకో

24.
వేడిఅన్నం అప్పడంముక్క తినో తినో
చల్దిఅన్నం ఉల్లిపాయ జుర్రో జుర్రో.
విశాఖపట్నం వీశెడు బెల్లం
నీకోపదలం నాకోపదలం
కళింగపట్నం కాసుల పేరు
నీకోపేరు నాకోపేరు
భీమునిపట్నం బిందెలజోడా
నీకోజోడా నాకోజోడా.
చెన్నపట్నం చెరుకుముక్క
నీకోముక్క నాకోముక్క.

25.
ఉసిరికాయకుండ ఊరుపిండికుండ
మెల్లగా దింపండి బెల్లాపకుండ.