పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



18 .
అన్నల్ల చెల్లెల్లు అలిగితే ముద్దు
పొన్నల్లు, గురివింద పూచి తేముద్దు
అన్నల్ల చెల్లెలే తాను అమ్మాయి
పొన్నల్లు. గురివింద తాను అబ్బాయి.

19 .
ఓమరిది సిగలోను వెండి మెరిసింది.
ఓమరిది సిగలోను పమిడి మెరిసింది.
మామరిది సూరన్న కుంచసిగలోను
బంగారుపువ్వుల్ల గుత్తిమెరిసింది
గుత్తి వెయ్యి జేసు కుందనం వెయ్యి చేసు
మామరిది సూరన్న మాట వెయ్యి చేసు

20.
ఎవ్వరే మాతండ్రి నేమిఅన్నారు
ఎల్లలేనివీధుల్లో యేనుగన్నారు
మత్తేభమన్నారు మావాడలోను
కూచున్నవారిలో గుమ్మడిపండనిరి
ఆడేటివారిలో అరటిపండనిరి
పాడేటివారిలో పనసపండనిరి.

2. ఆట పాటలు


21.
విద్డెం విద్డెం వరహాలవిద్డెం
విద్దెంచేస్తే గిద్దెడు నెయ్యి
తప్పకచేస్తే తవ్వెడు నెయ్యి
మళ్లీ చే స్తే మానెడు నెయ్యి.