పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

21



ఏరియేరి తొడిగిస్తు యెర్ర గాజుల్లు
నిలుచుని తొడిగిస్తు నీలిగాజుల్లు.

14.
అందలాలు రెండు పొందుబడిరాగ
ఎవ్వరందలమన్ని నేతొంగిచూతు
మావూరిఅందలం మల్లెపూఛాయ
మారాజుఅబ్బాయి అమ్మి కాబోలు
ఊరివారందలం ఉల్లిపూఛాయ
ఉత్తముడుచిన బాబు అమ్మి కాబోలు
కలవారిఅందలం కలవపూఛాయ
కాముడుచిన బాబు అమ్మి కాబోలు.

15.
అందలాలు రెండు పొందుబడిరాగ
ఎవ్వరందలమన్ని నేతొంగిజూతు
చుక్కలచంద్రుడే తానుఅబ్బాయి
ననుచూడవచ్చినే తానుఅబ్బాయి.

16.
వేసంగి కాలాన విత్తనాలుపోసె
వెన్నుడి కనుదృష్టి మేఘాలపైన.
మాయింటిబాబుల్లు మరితిరిగి రాగ
బాబుల కనుదృష్టి తమతల్లి పైన.

17.
శ్రీలక్ష్మి వరలక్ష్ము లొకచోటగూడి
ఎవ్వరినిపొందమని నన్నడగవచ్చె
“తూర్పుయింట్లోవున్న పెదబాబునుపొందు
పడమటింట్లోవున్న చినబాబునుపొందు
దక్షిణమింట్లోవున్న బుచ్చి బాబును పొందు
ఉత్తరమింట్లోవున్న చిట్టిబాబును పొందు.”