పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20


10.
చిట్టిళ్లు పొట్టిళ్లు కావాలనంటె
శివుడు మాకిచ్చేడు చిన్న బాలలిని
వారిక్కి పాలునెయ్యి కావాల నంటె
పరమాతుడిచ్చేడు పాడావుల మంద
వారిక్కి అన్నము కావాలనంటె
వరలక్ష్మీ యిచ్చింది వరుస గాదెల్లు.

11.
ఊళ్లోది బిచ్చము గుళ్లోదినిద్ర
ఎవ్వరిని పాడుతావు చంద్ర శేఖరుడ !
అందరూ కలవాడు అబ్బాయి బిడ్డ
ఆయుష్మంతుడని నే పాడుతాను.
 
12.
చిన్నారి పొన్నారి గాజుల్ల శెట్టి
తేవె మా అమ్మాయికి తేనెగాజుల్లు
గుడి తిరిగివచ్చేయి గుడ్లగాజుల్లు
గుత్తాన మాచిన్న అమ్మి చేతుల్ల
పట్నం తిరిగివచ్చేయి పచ్చగాజుల్లు.
పచ్చన్ని మాచిన్న అమ్మి చేతుల్ల
ఊరు తిరిగివచ్చేయి ఉత్తగాజుల్లు
గుత్తాన మాచిన్న అమ్మి చేతుల్ల

13.
చిన్నారి పొన్నారి గాజుల్ల శెట్టి
తేవె మా అమ్మాయికి తేనెగాజుల్లు .
నవ్వుతూ తొడిగిస్తు నల్లగాజుల్లు
పాడుతూ తొడిగిస్తు పచ్చగాజుల్లు.