ఈ పుట ఆమోదించబడ్డది
19
మారాజు అబ్బాయిని చేపట్టి తేను
మాలక్ష్మి అమ్మాయికి మరిచింత లేదు.
6.
వడ్డివారి బిడ్డల్ని నేనెత్తుకుంటె
వొప్పదే నామనసు ఓవిధములాయ
నాచిన్న అమ్మాయిని నేనెత్తుకుంటే
తనివాయె నామనసు సంతోషమాయె.
వడ్డివారిబిడ్డలార ! ఓ బాలులారా !
దొడ్డయేరొచ్చింది ఒడ్డెక్కరయ్య,
నాఅబ్బి బిడ్డలార ! ఓ బాలలార !
పాలసముద్రం వచ్చె పానుపెక్కండి.
7.
ఓసి ఓసి పిల్లికి సిగ్గేల లేదు
చిన్న నా అమ్మాయికి బుద్ధేల లేదు. '
జోలపాడుకృష్ణ జోకొట్టు బ్రహ్మ
పాలియ్యి భద్రకాళి నిద్రపుచ్చు శివుడ.
8.
పూసపాటివారి లోగిళ్లలోను
పురివిప్పి ఆడింది పున్నెంపు నెమలి .
భారద్వాజవారి లోగిళ్లలోను
పాలుతాగి ఆడేడు పట్టి అబ్బాయి.
9.
గుమ్మిడిపూచింది వంగవాలింది '
అతిరాచగారాల పండు పండింది
గుమ్మిడి మాయిల్లు వంగ మావంశం
అతిరాచగారాల పండు అబ్బాయి.