తొలిపలుకు
మిత్రులు శ్రీ కామేశ్వరరావు గారి పాతపాటలు అనే పుస్తకానికి తొలిపలుకు చెప్పే అదృష్టము నాకు కాకతాళీయముగా కలిగింది. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి దక్కవలసిన గౌరవము నా వేపు తిరిగింది.
ప్రతి గ్రంథానికి ఉపోద్ఘాతము అనేది ఉండటము లాంచనము. కామేశ్వరరావుగారు కూడా ఆ సాంప్రదాయము తప్పించటానికి యిష్టము లేక ఈ పని పెట్టేరని తోస్తుంది. కావలసినంత విషయ సమీక్ష కొమేశ్వరరావు గారి " సాంప్రదాయిక విజ్ఞానము ” అనే వ్యాసమే ఇస్తోంది. కూర్పరి తన ఆశయాన్ని వెల్లడి చేస్తూ కర్తవ్యము కూడా సూచించినాడు.
సాంప్రదాయిక విజ్ఞానము నశించకుండా పొందు చేసుకోడం నాగరి కతా లక్షణమని నాఉద్దేశము. ఈ విజ్ఞానాన్ని సేకరించి భద్రపరచ టానికి అనేకవిధాల శ్రమలకి లోబడవలసివస్తుంది. ఈ ప్రయత్నము ఈ సంపాదకుడు చెప్పినట్టు, సంఘం అంతాకలసి చేయవలసినపని కాని ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమయ్యేది కాదు. ప్రతివ్యక్తి బాధ్యత గుర్తించి కృషి చేస్తే ఈ కార్యక్రమము సమగ్రంగా నెర వేరుతుంది. పత్రికాధి పతులు ఈ ఉద్యమానికి ప్రోత్సాహమివ్వాలి.
కావ్యంలో భాష, భావము రెండూ నిర్దుష్టముగా వుంటేనే ఆది ఉన్నతశ్రేణికి చెందుతుంది. భాష, భావాలకి అనుగుణంగాను సందరో చితంగాను వుంటేనే కావ్యము రంజిస్తుంది. వ్యాకరణ సూత్రాలతో మేకు బందీ చేసిన భాష అవసరమని ఏమాత్రము, నా ఉద్దేశము కాదు. భావముయొక్క స్థాయి ననుగురించిఉంటే, కవిహృదయాన్ని వ్యక్త పరుస్తుంది.
ఇక భావము అనేది — కావ్యవస్తువు ఏ తరగతి సంఘానికి చెందితే దానికి అనుగుణంగా ఉండాలి. చిన్న పిల్లలని ఉద్దేశించి చెప్పే సందర్భ