పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5



గుమ్మడాకు మీద గువ్వ వాలింది
గువ్వెక్కి ఓరాజు గూడొగ్గినాడు
చిక్కుడాకు విూద చిలక అబ్బాయి
చిల కెక్కి అమ్మాయి చిక్కి వున్నాది
అరిటాకు కూడ హంస అబ్బాయి
హంసెక్కి అమ్మాయి అమిరివున్నాది.
కొబ్బరాకు మీద గోర అబ్బాయి
గోరెక్కి అమ్మాయి కోరివున్నాది
మామిడాకుమీధ మంచు అబ్బాయి
మంచెక్కి అమ్మాయి పొంచివున్నాది.
గుమ్మిడాకు మీద గువ్వ అబ్బాయి..
గువ్వెక్కి అమ్మాయి గూడొగ్గినాది.

17.
వేసంగి కాలాన ఓ పెళ్లికొడకా

వేపతోరణాల నీడనే రమ్మి
మాయింట అబ్బాయి పెళ్ల య్యెనాడు
మామిడితోరణాలు మరి దూరి రమ్మి.

18.
దేవూడిగ్గుళ్ళోను దేవు డాడీని

దేవేంద్రసభలోను జూద మాడీని
పరమేశ్వరుడు గుళ్లోను పాము లాడీని
పణతి నా నట్టింట బాల లాడీని.

19
పిల్లి పిల్లి పిల్లి పిల్లలకు తల్లి

పల్లేరుముళ్లలో పాలిచ్చిపోవె