పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

3    పల్లకీ యెక్కియ్యె ఓ రాజు రాగ
     బంగారు తలుపుల్ది యెవరి లోగిలి
     అందలా లెక్కియ్యె ఓరాజు రాగ
     అద్దాల తలుపుల్ది యెవరి లోగీలి
     ఏనూగ యెక్కియ్యె అబ్బాయి రాగ
     ఏకదివాణమ్ము వదినె లోగీలి
     పల్లకీ యెక్కియ్యె అబ్బాయి రాగ
     బంగారు తలుపుల్ది వదినె లోగీలి
     అందలా లెక్కియ్యె అబ్బాయి రాగ
     అద్దాల తలుపుల్ది వదినె లోగీలి.

10. గంధమ్ము తీసిన్న సాన చల్లన్న
     సభలోన అబ్బాయిమాట చల్లన్న..
     ఇండూవ తీసిన్న నీళ్లు చల్లన్న
     ఇంట్లోను అమ్మాయి కడుపు చల్లన్న.

11. గోపాలకృష్ణమ్మ పెళ్లయ్యెనాడు
     గోరింట పూచింది కొమ్మ లేకుండ
     మాయింట అబ్బాయి పెళ్ల య్యెనాడు
     మల్లెల్లు పూచేయి మొగ్గ లేకుండ.

12. ఉయ్యాలలో బాల వుగ్గు కేడు స్తే
     ఉత్తమ్మ యేశోద వూచి వుగ్గొయ్యి
     పల్లకీలో బాల పాలకేడుస్తే
     బలభద్ర మాలక్ష్మి పాడి పాలొయ్యి