పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2



   నాగగ (బ ?)ంధపు చెవులపోగు లున్నాయి.
   నా మేనఅల్లుడు రార అబ్బాయి!

6. ఏటిగట్టుమీద కరి వేపచెట్టు
   గాలివానవచ్చి కొమ్మ లల్లాడె
   కొమ్మలల్లాడెనే గొలుసు లల్లాడె
   కొనికొన్ని ముత్యాలచేరు లల్లాడె
   ఆ చెట్లపై నుండి అబ్బాయిరాగ
   బంగారు తలపాగ చెంగు లల్లాడె.

7. ఏవాడ వెళ్ళేవు అబ్బాయి నువ్వు
   ఎవ్వరు కట్టేరు కాళ్ళమువ్వల్లు
   కలవారి పట్టన్ని గారాములన్ని
   కంచారి కట్టేడె కంచుమువ్వల్లు
   తనతోడి పట్టన్ని తనకు ముద్దన్ని
   అన్నయ్య కట్టేడె వెండిమువ్వల్లు.

8. చిక్కుడు పువ్వెరుపు చిలకము క్కెరువు
   చిగురెరువు చింతల్ల దోరపం డెరుపు
   రక్కిన పండెరుపు రాగి చెంబెరుపు
   రాచవారిళ్ళలో మాణిక్య మెరుపు
   తా యెరుపు అమ్మాయి తనవారిలోన.

9. ఏనుగు యెక్కియ్యె ఓరాజు రాగ
   ఏకదివాణమ్ము యెవరి లోగీలి