Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92

సంధి

లను, పదములను క్రమముగా జాఱవిడువ మొదలిడును. కావుననే పక్కక్షరములతోఁ గూడిన పదము కాల కనుమున నల్పాక్షరములతోఁగూడిన దగుటయు, రెండుమూడు పదము లతోఁగూడిన వాక్య మర్థమునుబట్టి యొక్క పదముగా గ్రహీంపఁబడుటయు తటస్థించినపు డా పదములకుఁ బ్రత్యేక ముగాఁ గల స్వరము పోయి, యా పదసమూహమునకు నొక్క స్వర మేర్పడుటచే, నా భిన్న పదములలోని ప్రత్యేక ధ్వనుల ప్రాధాన్య మంతరించి, వానిలోఁ గొన్ని జూఱిపోవు టయు, నందువలన నా పద స్వరూపము మాఱిపోవుటయుఁ దటస్థించును. వెనుకఁ జూపిన యుదాహరణములే దీనికిని లక్ష్యములగును, అలసతవలనను, సౌకర్యా పేక్ష చేతను మానవుఁ డల్పతర ప్రయత్నమూలక మగు నుచ్చారణ వేగ ముచే కొన్ని ధ్వనులను జాఱవిడుచు సందర్భమున నెట్టివానిని విడువఁగలడు అను ప్రశ్నమున శ్రీ స్వగమును గూర్చిన విచా రణము కొంత సమాధానమును జెప్పుచున్నది. అనఁగా నొక శబ్దమునఁగాని వాక్యమునఁగాని ప్రాధాన్యమును వహించిన వగుటచే నూఁది పలుకవలసిన ధ్వనులను జాగరూకతతోఁ బలుకుచుఁ దక్కినవానిలో మిగుల నప్రధానములగుటచే, నేమాత్రము నూఁది పలుకవలసిన యావశ్యకత లేని ధ్వను లను జాఱవిడుచుచుండు నని మనము గ్రహింపఁదగి యున్నది. కావుననే ఇంగ్లీషు భాషలో, 'man-like' అను రెండు పద ములు ప్రత్యేక స్వరములతో గూడినవి, కలిపి యుచ్చరింపఁ