Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోప సంధి

91

'మెటర్ధస్ఫురణ గలుగుట తటస్థించినదను ప్రశ్నకు సమాధాన ముగా వ్యవహారభాషకు స్వరము (accent) ఊనిక (emphasis) అను వాని సహాయము కలదని యీవరకే సూచింపఁబడినది గదా. ఇట్లు స్వర మనున దొకటికలదని సామాన్యముగా మాటలాడునపును మనము గుర్తింపము గాని, యది యెల్ల పుడు మన యుచ్చారణ ననుసరించియే యుండి మనకుఁ `దెలియకుండగ'నే మన ముచ్చరించు ధ్వనులయందు విచిత్ర ములగు మార్పులను కలుగఁ జేయుచుండును. వ్యవహారమం దున్న భాష కాలక్రమమున మాఱిపోవుచుండుటకుఁ గల ముఖ్యకారణములలో నిదియు నొకటి. నాలుగై దక్షరములు గల పదమున గాని, నాలుగైదు పదములతోఁగూడిన యొక వాక్యములోఁ గాని యొక యక్షరముపై లేదా పదముపై న్యూత (emphasis) పడి యా యక్షరము లేదా పదము మాత్రమే' యూఁది బలుకఁ బడినపు డా పదములోని తక్కిన యక్షరములు, లేదా యా 'వాక్యములోని తక్కిన పదములు కొంతవఱకు తేల్చి పలుకఁ బడుటయు, నట్లు తేల్చి పలుకఁ బడినవి కాలక్రమమున నుచ్చారణమున జాఱవిడువఁబడుట యుఁగూడ తటస్థించును. సౌకర్య కాముఁడగు మానవుఁడు · తన భావము నితరులకు వ్యక్తపఱచుట నెప్పటి కప్పు డల్ప తరంబగు ప్రయత్నముచే సాధింపయత్నించుచుండును గావున.. నెట్లయినను దన భావ మితరులు గ్రహింపఁగలుగుదు రను నమ్మకము గలిగినచో మాఁది పలుక, నవసరము లేని యత, రము