Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

90

సంధి

చుచుఁ దన వెనుకటి ప్రామాణికత్వమును విడువకయే తొ నా వ్యవహార ప్రసిద్ధములగు నూతన రూపములను గ్రహించి వానికి ప్రామాణికత్వము సిద్ధింపఁ జేయుచుఁ దానును నూతన సంస్కారములను బొంది నవ్యస్వరూపమును గాంచు చుండును. లేనిచో నది యట్లు ముందుకు నడువనిచో “ప్రాత వడ్డేమాటయై, రసభంగము చేయుచు నే పొలమునుగాని యట్టి క్రమముఁ బొందినదగు ” నేమో యనియు, కవులు తనను జేపట్టుట “జరద్వభూవిషయ సంగర సరసికతను బోలు నని” తలంచి పరిహరింతురేమో యనియుఁ గొంత భయము దానికిని గలదు. కావుననే వ్యవహార ప్రసిద్ధము లగు నూతన రూపము లా యా కాలముల కవుల రచనాప్రాగల్భ్యము పండగాఁ జేసికొని యింతకుఁ బూర్వమే ప్రామాణికత్వమును బడసిన గ్రాంధిక భాషలోఁ జేరి తామును బ్రామాణికత్వ మును బడయుచుండును. ఈ రీతిగా నొక కాలమున భాషలో వ్యవహారమందే లేకపోయినను, కాలక్రమమున జనుల యుచ్చారణమునందలి వేగమునుబట్టి వ్యవహారములోనికి వచ్చి, సామాన్యన్యవహార ప్రసిద్ధములై వ్యాప్తి గాంచుటచే, తరువాతి కాలమున నొకప్పుడు గ్రాంధిక భాషలోని కెక్కిన రూపములలో జేరినవే యీ "గంగనుకా సె”. “చేష్టుడిగా ” . మొదలగునవి. గ్రాంధిక భాషలో నర్ధ స్ఫురణమున కడ్డుపడుచున్న వని చెప్పఁబడిన యీ రూపములకు వ్యవహారమున మాత్ర.