Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లోప సంధి

87

స్థించినపుడును గూడఁ గొన్ని సంధులు ప్రత్యేకముగాఁ గొన్ని పదముల విషయమునమాత్రమే భాషలోఁ గానవచ్చుచుండు టయుఁ గలుగును. చింతాకు, అనంత, సుబ్బయ్య మొదలగు పదబంధములు వ్యవహార బాహుళ్యముచే గలుగు వేగోచ్చా రణమునఁ జిరకాలము క్రిందటనే భాషలో నేర్పడినవి. మేనత్త, మేనయత్త అను రూపములు రెండును బ్రచార ములోనున్నను, రెండవదానికంటె మొదటిదే వ్యవహార బాహుళ్యము కలదగుటచే కొద్ది కాలమున కె యిదీయు నిత్య సంధి గలదిగాఁ దలంపఁబడుచున్న పై శబ్దముల తెగలోఁ జేరవలసినదే యగును.

ఇంక స్త్రీ వాచక తత్సమ సంబోధనాంత శబ్దముల విషయమున వీని తుదియచ్చు ప్రత్యేకార్థబోధకం బగుచుం డుటచే, నది లోపించినచో నర్థమునకు భంగముక లుగును భంగముకలుగును గావున నట్టి సందర్భముల సామాన్యముగా సంధి జరుగుట . లేదు. కావుననే వైయాకరణులు గూడ నట్టి సంధిని నిషే ధించిరి. "రాముఁడ ఇటురమ్ము” అను నప్పుడు సంధి జరిగి. నచో సంబుద్ధ్యర్థం మేమాత్రమును. బోధపడక యేపోవును. తత్సమ అకార సంధిలోను నిట్టి చిక్కు లేకపోలేదు. అట్లయ్యును “గంగనుకాసె, చేష్టుడిగే, రంగభ ర్తంచు" అను కోన్ని స్థల ములలో తత్సనూ కారసంధిని నిరంకుశులగు కవులు చేసియే యున్నారు. అర్థముకాని పదమును, లేదా పదసంధిని వీరు మాత్ర మేల ప్రయోగించినా రను విషయమును విచారింప