86
సంధి
డప్పటినుండియు నా యక్షరముల నన్నిటి నుచ్చరింప యత్నింపనే యత్నింపఁదు. ఈ కారణము చేతనే పదముల నడుమను, వాద్యముల నడుమను గల యక్షరములు కొన్ని- ముఖ్యముగా సూది పలుకవలసిన యావశ్యకత లేనివి కాల -క్రమమున సంతరించుటయు, నా పూర్వపదములు, తరువాతి వారు గుర్తుపట్ట లేనంతగా నూఱిపోవుటయు సంభవించు చుండును. "వేగముగా రమ్ము," అను వాక్యము ద్రుతతలో చ్చారణమున మొదట “వేగంగా రా” అనియు పిదప "వేగంరా” అనియు “వేనా నా" అనియు నగుచున్నది. “వేరా” యనియుకూడఁ గావచ్చును. గ్రీకు లాటిన్ భాషల లోని, Eleemosyne అను పద మాంగ్ల భాషలోనికి వచ్చు సరికీ 'alms' అను పదముగా మాఱుటకుఁ గారణమిదియే. Cup-board, ship-board అను పదములు కబోర్డు, పీ. బోర్డ్ అని పలుకఁబడుచునే యున్న విగదా. Is not, can not, do not - మొదలగునవి వ్యవహార వేగమువలన నేగదా, isn't, can't, don't అని పలుక ఁబడుచు, వ్రాతలోనికిఁ గూడ నెక్కి శిష్టజనాంగీ కారమును బడయుచున్నవి.
ఇట్లే ద్రుతతరోచ్చారణము కారణముగా భాషలో బయలు దేరి వ్యవహార బాహుళ్యముచే నర్థస్ఫురణమునకు భంగము కలుగని 'సందర్భములలోను, సుప్రసిద్ధుఁ డగు మహా కవి యొకఁడు తాను గడించిన నిరంకుశత్వ బలముచేతనో ఛందస్సౌకర్యమునకో యెప్పుడైనను బ్రయోగించుట తేట