82
సంధి
మాత్రము కలుగఁబోదనియు, అకారేకారాంత శబ్దముల తుది యచ్చులు లోపించి సంధి జరిగినచో నొకప్పుడు అర్థమునకు భంగము కలుగుచున్న దనియు నై యున్నది. నెల+ఆలు: సీత + ఇచ్చట, రాముడు + ఎక్కడ, హరి + ఉండెను, చేసి+ ఏగెను మొదలగు సందర్భముల తుది హల్లు లోపించి సంధి జరిగినచో నగ్ధ స్ఫురణము ణము విషయమునఁ గలుగు చిక్కును గూర్చి యింతకు పూర్వమే తెలిసికొని యున్నాము. అనఁగా నీ పదములలోని తుదిహల్లులు లోపించినచో నగ్గ ప్రతీతికి భంగము కలుగుచున్న దన్నమాట. కావుననే ముఖ్యముగా "స్త్రీ వాచక తత్సమ సంబోధనాంత శబ్దముల అకారమునకు సంధిలేదు,” అనఁగా నది లోపింపదు, అని చెప్పఁబడినది. తెనుఁగులో అకారాంతములైన తత్సమ శబ్దములు గంగ, దూత మొదలగునవి సంస్కృతమందే ఆకారాంతములై యుండుటచే, వాని తుదియకార మచ్చట నిలిచినగాని శబ్దస్వ రూపము తెలియదు. అట్లే నెలత, కొమ్మ, మొదలగు స్త్రీ వాచక దేశ్య శబ్దములలోగూడ తుది అకార మీ భాషలో -సహజముగ శబ్దగత మగుటచే నది లోపించినచో నగ్ధస్ఫురణ కలుగకున్నది. సంబోధనాంత శబ్దముల తుది యచ్చుకూడ, ప్రత్యేకార్థమున వచ్చినదే యగుటచే నది లోపించిన నా .ప్ర యర్థమున కే భంగము కలుగునుగదా.
ఇంక మేన + అత్త అనునపుడు సంధివికల్పము. అనఁగా మేనలోని తుది “అ” కారము లోపించినను అర్దము అర్థమునకు