Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంధి : స్వరూప లక్షణములు

77

సంధ్యక్షర మాగమ మగుట తటస్థించుటయో ప్రధాన మైన సంధికార్యముగాఁ గనఁబడుచున్నది. ఎట్లైనను, పూర్వస్వరము లోపించి వెనుకటి హల్లు ముందుస్వరముతోఁ గలిసినను క్రొత్త హల్లొకటి వచ్చి యది ముందు స్వరముతో ద జేరినను, ఒక హల్లు తరువాతి యచ్చుతో నెనయుటయే యిచ్చట జరుగు సంధికార్య మనవలసి యున్నది. నర్ణ సమీ కరణాది సంధికార్యములు మఱికొన్ని యుండుఁగాక. ఈ సంద ర్భమున సంస్కృతభాషలోని సంధికిని, తెలుఁగు సంధికిని గల భేదమునుగూర్చి యించుక పరిశీలింపవలసి యున్నది. సంస్కృ తమునందలి యేకా దేశసంధి యనఁగా పూర్వపరస్వరములు రెండును లోపించి వానికి బదులుగా నా రెంటికంటెను భిన్నం. బగు నేకాక్షరము వచ్చుట. “అనర్ణాదచిపరె పూర్వపరయో రే గుణా దేశః స్యాత్.” గంగ+ఉదకం, అని అకారము నకు 'ఉకారము పరమైనపుడు "గంగుదకం" అని గాని, లేదా 'గంగయుదకం, గంగవుదకం' అని గాని కాక, ఉకారములు రెండును పూర్వపరస్థానీయములగు అకార లోపించి నాని స్థానమున "మ" కారము వచ్చినది. అట్లే 'గచ్ఛ+ఇతి=గచ్ఛేతి? అని ఆకార ఇకారముల స్థానమున ఏకారము, వచ్చినది : గాని గచ్చితి, గచ్ఛయితి, అని గాని కాలేదు. ఈ విషయమున అనఁగా నీ యేకా దేశసంధి విష యమున ద్రావిడభాషలలోని పద్ధతికి సంస్కృతభాషలోని పద్ధతికి నెట్టి సంబంధము కనఁబడదు. ఈ భాషలలో పూర్వ