Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74

సంధి

శబ్దము తత్సమమైనపుడు ధేను+ఉ= ధేను+న్+ఉ= ధేనువు అని యగుటకు "ఇయం ధేను ననియె” అన్నపుడు గలిగిన పుగాగమమే కారణము. కాని యాంధ్ర వైయాకరణులు 'దీనిని గమనింపక 'వు' అనునది ప్రథమావిభక్తి ప్రత్యయ మనియు, దాని కచ్చుపరమైనపు దుకారలోపము గలుగు ననియు చెప్పినారు. దీనినిబట్టి ధేనువు అను తత్సమ శబ్దము లోని తుది ఉకారము 'ధేను' శబ్దములోని ఉకారమువలె సహజముగ శబ్దగము కాదు గావున లోపించుచున్నదని తెలియుచున్నది.

ఈ వకారాగమము విషయమున మఱియొక విశేషము గమనింపనగును. ఇకార ఎకారములపై మాత్రమే రావలసిన యడాగమము, అకార ఓ కారములపైఁగూడ వచ్చుచున్న దే యెట్లని మనము విచారించుచుండ, కన్నడమున కొన్ని సందర్భములలో ఇ, ఈలపై గూడ యడాగమమునకు బదులు వకారాగమమే కలుచున్నది.

""ఇ ఈ' ఎంబక్క రంగళనను కరిసి తోరువల్లియుం నడువే వత్వం.”

ఉదా:- ఈ విపు గ్రంథంగళ్. ఈ+ఇధు= ఈ విదు. ఈ విదు గ్రంథం

ఇది నిర్దేశ వాచకముల పైనిమాత్రమే వచ్చుచున్న దగుటచే నీ నిర్దేశ వాచకములు “వ” కారాంతములే యను పక్షమున, నీ నకార మాగమముగాక శబ్దగతమే యగుట