10]
సంధి : స్వరూప లక్షణములు
73
శబ్దములన్నిటిని 'వు' వర్ణాంతములుగ గ్రహించినందువలన నే తెలుఁగు భాషలో సంధి గలిగినపుడు నకారాగమమున కావు శ్యకము లేకపోయినది. సంస్కృతో కారాంత శబ్దములు తత్సమము లైనపుడు తుదిని వునర్ణమును గ్రహించునవిగాఁ దలంపఁబడుట చే నీ భాషలో నచ్చుపరమైనపుడు “వు” వర్ణముపైనున్న ఉకారము లోపించి, పరస్వరైకా దేశసంధి జరుగుట కవకాశ మేర్పడినది. కాని సంస్కృత శబ్దమునే, అనఁగా తత్సమముగాఁ జేయని శబ్దమునే అనుకరణాదు లందుఁ దెనుఁగునఁ జెప్పవలసి వచ్చినపుడు మాత్రము స్వత స్సిద్ధముగా సంస్కృతశబ్ద ముకారాంతమే యగుటచే నందలి యుకారము లోపించిన నామరూఢికి అర్ధమునకు భంగము కలుగును. గావున నది లోపించి సంధి జరుగుటలేదు. కాని "ఇయం ధేనుః+అనే” అనునది. విసర్గ లోపించిన పిదప “ఇయం ధేననా” యనికాక నడుమను వుగాగమంబు గలుగు టచే “ఇయం. ధేనున నౌ” అనియే యగుచున్నది. ఇట్టి రూప మును సాధించుట కే బాలవ్యాకరణకారుఁడు “ఉదంతనామం బున కనుకరణంబున వుగాగమం బగు” నని యొక ప్రత్యేక సూత్రమును కల్పింపవలసినవాఁడై నాఁడు. స్తనముగా ధేనువు + అది = ధేనువది అన్నపుడును, “ఇయం ధేనుః + అనియె=ఇయం ధేనువనియె” అన్నపుడును జరిగిన సంధి కార్య మొక్కటియే గాని, యా రూపములను సాధించు విషయము మాత్రము . భిన్న పద్ధతు లవలంబింపవలసి వచ్చినది.