సంధి : స్వరూప లక్షణములు
71
తెలుఁగున వలెనే పరమం దే యచ్చున్నను అన్నిటిక్ యడాగమమే వచ్చునని చెప్పఁబడినను, కన్నడమున పరమం దోష్ఠ్యస్వర మున్నచో వకారము వచ్చునని “ఆత ఓ ప్ల్యే, ఓప్యేపరే ఆకారస్య నగ్ భవతి” అను నపవాదసూత్రముచే కర్ణాట శబ్దానుశాసనమున వకార విధానముకూడ చేయఁ బడినది.
ఉదా:అ+ఉదకం=ఆ వుడకం, ఆ+ఊర్=ఆపూర్. కాని యిది శబ్దమణిదర్పణ కారుని మతము కాదు. అతని మతమునుబట్టి యడాగమమే తెలుఁగునవలె రావలసి యున్నది. దీనినిబట్టి వ్యవహారమందలి రూపములను శబాను శాసనకారుఁ డంగీకరించిన ట్లగపడుచున్నది.
ఆంధ్రమున నిట్టి సంధి వ్యవహారమునఁ గనఁబడుచు నే యున్నను, దాని సాధుత్వమును వైయాకరణు లంగీకరింప లేదు. కావున ఆ యూరు, ఆ యుదకము అనునవే యాంధ్ర మున సాధువులైనవి గాని, “ఆ వూరు” మొదలగునవి ప్రయో గార్హములు కాలేదు. మఱియు "రావో ర్వక్" అను కర్ణాటక శబ్దానుశాసన సూత్రముచే “ఋవర్ణ ఇనర్ల ఔశార ఉవర్ణా నాం వగ్భవతి స్వరేపరే” అని ఋ, ౠ, ఇ, ఇూ, ఔ ఉ, ఊ, వర్ణములకు స్వరము పరమైనపుడు “వ” కారాగవ మగుచున్నది.
కుడు + ఉదు=కుడువుడు కూర్మెయల్లి = ప్రీతితో వలయును,