68
సంధి
కారములు పూర్వమందుగాని పరమందుగాని నిలిచినపుడు
తత్ స్థానీయములగు తాలవ్యోష్ఠ్యాంతస్థవర్ణము లుచ్ఛారణ
మునకు సహాయవర్ణములుగా వచ్చి చేరుట సహజమే. కాని,
పూర్వపరస్వరములు రెండును అకారములైనప్పుడును, తత్సమ
శబ్దములపైని గూడ యకారము వచ్చుటకుఁగల కారణ
ముచ్చారణసౌలభ్యమే యని చెప్పనలనుపడదు. అట్టి సంద
ర్భములలో నెల్లఁ బైని దెలుపఁబడిన విలై మొదలగు ప్రాచీన
భాషలోని ఐకారాంత శబ్దముల సంధిగతరూపముల సాదృ
శ్యముచేతనే యకారము గలిగిన దని తలంపవలసియున్నది.
ఇట్లు “ నెలయాలు' మొదలగు వాని సామ్యముచే, 'మాయావు' .
' సీతయడిగెను ' మొదలగు రూపమున సంధి యేర్పడి.
.: యుండును,
ఇంక నీ భాషలలోఁ బ్రాచీనకాలమున సంహితలో ఉ గూడిన రెండకారములకు, నడుమ నోష్ఠ్యాంతస్థమగు వకా రము గూడ. వచ్చుచుండినట్లు కొన్ని సందర్భములను బట్టి యూహింపఁ దగియున్నది. తమిళ కన్నడములలోని ప్రథమ పురుష స్త్రీ పుం సర్వనామరూపములు, ఆవళ్, ఇవళ్, అవన్, ఇనన్, మొదలగునవి 'వ' కారమధ్యములై యున్నవి.. ఇవి యీ భాషలన్నిటిలోఁగూడ మిగులఁ బ్రాచీన రూపము లనుటకు సందేహములేదు. ఇవి నిర్దేశక వాచకములగు, అ, ఇ లకు, అళ్, అస్, ఆళ్ (ఆలు) ఆణ్ అను శబ్దముల సంక్షిప్తరూపములను జేర్చుటచే నేర్పడినవి. అ+అన్ అని