Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

298

సంధి

కన్నడములలో వలె వకారము సంధ్యక్షరముగాఁ దెలుఁ గులో గ్రహింపఁబడుటయును లేదు.

3. ఈ భాష లన్నిటిలో నచ్చు పరమయినపుడు పదాంతమందలి అ, ఇ, ఉ, ఎ లు సామాన్యముగా సంధి జరుగుచునే యున్నది. సామాన్యముగా లోపించి

4. ఆంధ్రమున వలెనే యీ భాషలలో నచ్చుకంటే పరమైన ఏడాది క, త, ప వర్ణములు గ, ద, వ లగుచున్నవి. కాని కన్నడమందలి విశేష మేమనఁగా ప వర్ణము బకారముగ మాఱుటయేగాక, ప, బ, మ లు మూఁడునుగూడ "వ" కారముగ మాఱుచున్నవి. ఆంధ్రమున 'చ' కారము సకార మగుచుండ కన్నడమున సకారము చకారముగా నూఱు టయుఁ గాననగును. ఇట్లే స్వల్ప భేదములున్నను పెక్కు విషయములలో సామ్య మగపడుచునే యున్నది.

దీనినిబట్టి వి శేష విధులలో యత్కించిద్భేద మున్నను సామాన్యసంధిపద్ధతులలో నీ భాషల కన్నిటికిని చాల చేరిక గలదని యా భాషాలక్షణములను సరిపోల్చి చూచినవారికి వ్యక్తము కాకమానదు. మఱియు నొక భాషయందలి లక్ష్మణ . విశేషముల నితర భాషాలక్షణములఁతో పోల్చి చూచినపు -డా విశేషలక్షణములకుఁ గల కారణములు తెల్లంబగుటయు, వానీ పూర్వచరిత్రము ఆయా భాషుల ప్రాచీనస్థితి వ్య క్తమగు చుండుటయుఁ దటస్థించును. కావున నిట్టి చారిత్రక విమర్శ