296
సంధి
టయు సంభవించుచుండుట చేతను, నీ సంధి ప్రకరణమును చదువుకొనవలసిన యావశ్యకత యేర్పడుచున్నది. మొత్తము పైని సంస్కృతభాషలోవలె సవర్ణదీర్ఘ, గుణవృద్ధి యణా దేశాది సంధికార్యము లిందు లేకుండుటచే నీ భాషలోని సంహితా కార్యములు భిన్న పద్ధతుల ననుసరించి యేర్పడిన వనుటకు సందేహములేదు. మఱియు సంధి విషయమున నాంధ్రమం' దవలంబింపఁబడిన పద్ధతులే తక్కిన దక్షిణ దేశ భాషలందు నగపడుచున్నవి. కాని, సంస్కృతభాషలోని సంధి పద్ధతు లగ పడుటలేదు. కావున వీని సాజాత్యమును నిర్ణయించుట కీదియు నొక యాధారం బగుచున్నది.
సంధి విషయమున నాంధ్ర తమిళ కర్ణాట భాషలకు గల సామ్యము.
1. ఈ భాషలలో పూర్వపదాంత్యవర్ణము పగపదాది వర్ణముతోఁ గలియుటయే సంధి యగుచున్నది. సంధికార్య ములలో తమిళ. కన్నడముల సంత్యహల్ ద్విత్వము, ప్రకృతి : భాగము ననునవి వి శేషములు. ఆంధ్ర వైయాకరణు లంత్యహల్ ద్విత్వమును బ్రత్యేక విధిగాఁ జెప్పకున్నను, "పదాహతి+ ఎగసి=పదాహతిన్నెగసి,సర్వమున్+అతని= సర్వమున్న తని? అను నిట్టి కవిప్రయోగములం దంత్యహల్ ద్విత్వము. కాన వచ్చుచునే యున్నది. ఇట్టి స్థలములందలి ద్విత్వ నకారము
కలుగుటకుఁ గారణము తొలిపదాంతమునఁ జేర్చిన యొక సము