Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా ద్రుతప్రకృతిక విభాగము

295

రమునుండి తొలఁగిన ఉరు= ఉండు - విజృంభించు; మిన్ (మించు ?)=ప్రకాశించు, అను ప్రాచీనధాతువులనుండి యేర్ప డిన వ్యతిరేక క్త్వార్థకరూపములే మైయుండును. కావుననే కళలైనవి. బళి మొదలగు ప్రశంసార్థక శబ్దంబులు; అక్కట, అయ్యో అను సంతాపార్థకంబులు; అదియ, అదే అను నవ ధారణార్థకములు మొదలగు వానిలోని తుదియచ్చులు శబ్ద మొదలగువానిలోని గతములు. ఇవి యంతమున నిలిచి యాయా యర్థములను సూచించుచున్నవి. కావున నాయా శబ్దములు నకారాంత ములు లేదా ద్రుతప్రకృతికములు కాక కళలే యైనవి.

ఈ భాష చాలవఱ కజంత భాషగా మాఱిపోయి, పదాంతమందు నిలిచియున్న హల్లులలో నొక్క నకారము మాత్రమే ప్రాధాన్యము వహించిన దగుటచే నీ భాషలో ద్రుతాంతశబ్దములు ప్రత్యేక మొక తెగగా నేర్పడి ద్రుత ప్రకృతికములనియు, నట్లు ద్రుతాంతములు కాని తక్కిన శబ్ద ములు కళలనియు నొక విభాగ మేర్పడుట తటస్థించినదని తెలియవచ్చుచున్నది..

సంహితలో ననఁగా రెండు పదములు కావ్యవహిత సాన్నిధ్యము గలిగినపుడు పూర్వపదాంత నకార మొకప్పుడుఁ' వెనుకటి యచ్చులతోఁగూడ లోపించి, పరస్వరం బచ్చోట నిలుచుటయు, మఱియొకప్పుడు ద్రుతముపై సరళాదేశాది కార్యములును జరుగుటయు, ద్రుతాంతములు కాని కళలపై నొకప్పుడు సంధి జరుగుట లేదా యడాగమాధులు గలుగు