Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

294

సంధి

రేకచిహ్నముగాఁ గనఁబడును. గానీ వా స్తవముగా నది యట్టిది గాదు. ఏలయనఁగా నిందలి “క” పర్ణము వేరొక ధాతువుయొక్క — ప్రాయికముగా "గు" ధాతువు యొక్క యవశిష్ట భాగమైయుండ నోపును. తక్కిన ద్రావిడభాషల లోనై న నీ కవర్ణ మగ పడదు. కాని తమిళమునందలి వెయ్యా దే (= చేయక) పోగాదే (= పోవక) మొదలగు రూపములు "శెయ్యా (అ)దె, పోగా (అ)దె (=శెయ్య+అగాదె, పోవ + అగాదే) అను మూలరూపములనుండి యేర్పడినవని యూహింప వచ్చును. చేయ (న్) కాదు, పోవ (న్) కాదు-అను వ్యవ హారము తెలుఁగున నిప్పటికిని కలదుగదా. అప్లై “చేయా గాదె - పోవాగాదె యను ప్రాచీన భాషారూపములనుండి “చెయ్యాదె, పోవాదే” యని తమిళమునను, చేయక, పోవక అను రూపములు తెలుఁగునను, (మాడాదె) మాడ (హోగాదె) హోగదె అను నవి కన్నడమునను బయలు దేరి యుండును. దీనినిబట్టి “చేయక” అను రూపములోని 'క కారము “అగు” . ధాతువునుండి యేర్పడిన వ్యతి రేకార్థక "అగాదు” అనుదానికి సంబంధించినదనియు “క” కారము పై గల “ఆకారమే వ్యతి రేకభావచిహ్న మనియు, నట్లది ప్రత్యే కార్థద్యోతక మగుటచేతనే పదాంతమున లోపింపకుండెన నియు నా కారణముచే నది ద్రుతాంతము కాక కళయయ్యె ననియు; నిశ్చయింపఁ దగియున్నది. ఊరక, మిన్నక అను తూప్లీ మర్థ కావ్యయములు కూడ నిప్పుడు భాషలో వ్యవహా