Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

292

సంధి

కావలసియున్నది, కాని యిందలి వ్యతిరేకార్థక చిహ్నము యొక్క బలముచే సువర్ణముపై గొంత యూఁతపడుట వలనఁ గాఁబోలు దానికి ప్రాధాన్యము కలిగి తుది యుకారముగాని, నకారముగాని యవసానంబునందు ద్రుతత్వమును బొందుట అనఁగా లోపించుట సంభవింపలేదు. ఈ కారణము చేతనే తుమున్నర్థ కాన్నంత శబ్దము "రాన్" అనుదానితోఁ గలుగు స్వరూపసామ్యము కూడ వారింపబడినది. ఇంక ఎత్తిలి, ఒత్తిలి అనున విప్పు డవ్యయములుగాఁ బరిగణింపఁ బడుచు నును వా స్తవముగా నవి ఎత్తిలు, ఓ త్తిలు, అను ధాతువుల నుండి యేర్పడిన క్త్వార్థక క్రియారూపములే యవవచ్చును. ఎ త్తిల్లు-ఎ త్తలు, అను క్రియారూపము లిపుడు భాషలోఁ గనఁ బడ కున్నను, 'ఒత్తిలు' ఒ త్తిల్లు, ఒత్తిగిల్లు, మొదలగు క్రియలు—‘ప్రక్కకొఱగు' 'అంటుకొను' అనువర్ధము గలవి కనఁబడు చున్నవి. ఒక వస్తువు మఱియొక వస్తువుపై కొఱగి గట్టిగా సంటుకొనుట యను నర్థమును బట్టి గట్టిగా పట్టుగా, అను నర్థమున ‘ఒత్తిలి” యనున గోక యవ్యయముగాఁ దరు వాతి కాలమునఁ బరిగణింపఁబడియుండును. అట్లే 'ఎత్తిలి' అనునదియు, ఎత్తిలు ఎత్తిగిలు అనువానినుండి ఎత్తు అగు నట్లుగా - హెచ్చుగా బిగ్గరగా - అను నర్థమునఁ -దోలుతం బ్రయోగింపఁబడి, ' కాలక్రమమున దాని మూలధాత్వర్థము విస్మృృతమైన పిదప సవ్యయముగాఁ బరిగణింపఁబడఁ జొచ్చి యుండును. .దీనికి శబ్దరత్నాకరమున్న.