37]
కళా ద్రుతప్రకృతిక విభాగము
289
ఇంకన్=ఇవి+కన్: కన్న-ఇనం, తమి. ఇన్జు= ఇప్పుడు, ఈ దినము (This time). కన్న-ఇనితు--ఇస్తు=ఇంత (This much, this measure). ఉదా: ఇన్దనక = (Till now) ఇంత దనుక = ఇందాకా. ఇంకన్. - ఇని + కన్ (అగన్) అనఁగా ఇప్పుడు - ఈ వర్తమానకాలము కాఁగా- ఈ కాలము జరు గఁగా-ఈ కాలమైన తరువాత అని యర్థము కలుగుచున్నది.
తనుకన్= తనుకు+అన్ = తనుకన్. తనకు ధాతువు నుండియే "తాఁకు” ధాతువేర్పడినది. అంతతనుకన్, అనఁగా “అంత- ఆకాలమును లేదా ఆ పరిమాణమును తాకఁగా-- చేరఁగా; అంతకాలము చేరువఱకు- అంతనఱకు అనునర్థము కలుగుచున్నది.
ఈ అన్నంతశబ్దము లన్నియు ప్రాచీనభాషలో అల్లంత ములే యనుటకుఁ దమిళ కన్నడ తుమున్నంత రూపములు పెక్కు అల్లంతములే యగుటయుఁ గర్మణ్యర్థమునఁ దెనుఁ గులో వలెనే వీనిపై "పడు" ధాతువు చేర్పఁబడుచుండు టయుఁ దార్కాణమగుచున్నది.
కన్న, తానిరల్ పట్టం—నీనిరల్ పట్టమ్, కురుకులాధిపం సుడియల్ = కురుపతి నుడువన్ చెప్పఁగా.
ఈ అల్లంత శబ్దములపైని “ఒడం” (=తోడు) అను దానినిగూడఁ జేర్చి చెప్పుదురు. ఉదా: నుడియలోడం=నుడు వంగా; నుడివినతోడనే నుడియల్ పట్టం - నుడువంబడఁగా, నని కర్మణ్యర్థమగును. చేయన్, పోషన్ అను నర్థమిచ్చు