282
సంధి
భాషలలో 'వచ్చినాఁడు' మొదలగు రూపములకంటె మిక్కిలి ప్రాచీన కాలమున నేర్పడినదగుటచేతనే యది యట్లయ్యే నని చెప్పుట కవకాశము లేకపోలేదు. అనఁగా నీ రూప మీ భాషలో ప్రథమపురుష సర్వనామము "వాఁడు” అను రూప మును బొందక పూర్వము కొంతకాలము క్రిందటనే యేర్పడి యుండుననుట. ఈ "వాఁడు” అనుదాని ప్రాచీనరూపము “అవన్" అనునది. “వచ్చి" అను భూతన్యూనరూపముపై “అవన్" అనుదాని సంక్షి పరూపమగు "అన్" అనుదానిని జేర్చుటచే "వచ్చి+అన్” = వచ్చియన్-వచ్చన్ - వచ్చెన్ అను భూతకాలిక క్రియారూప మేర్పడియుండును. “వచ్చన్” అనుదాని స్వరూపమే యిప్పటికిని వ్యావహారిక భాషలో వచ్యాఁడు, వచ్చాఁడు అను దానిలోఁ గానవచ్చుచున్నది. వచ్చి. పోయి అను భూతకాలిక రూపములపై “అన్" అనునది చేరినపుడు “పోయి+అన్" అని యుండఁగా, పరమందలి వివృతాకారసాహచర్య బలముచే “పోయి” లోని ఇకారము కొంత వివృతత్వము నొందుటచే “పోయె+అన్=పోయేస్? అనియు, నింకను వివృతమై “పోయన్" అనియు రూపముల నొందియుండును, కాని ప్రాచీన కావ్యభాషను దిద్దినవారు ఎత్వముతోఁ గూడిన రూపమునే గ్రహించి,, కావ్యములలోఁ బ్రయోగించుటచే దానికిమాత్రమే ప్రామాణికత్వము సిద్ధించి నది. తాటి+ఆకు, మట్టి+ ఆకు అనువాని సంధిగ తరూపము man” అనుదానిలోని వివృతమగు “ఆ” కారధ్వనితో వ్యవ