Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా ద్రుతప్రకృతిక విభాగము

271

తిన్నంగన్ – తిన్న ఁగాన్, అనునవే గాక, చేతన్, దాని రూపాంతరమగు చేన్, తోడన్ = త్రోడు + అన్), దాని రూపాంతరమగు "తోన్" వలనన్ (వలను+అస్), లోపలన్ (లోపలు+అన్), లోస్, (ఉల్డ్ +ఆన్) లోనక్ (లోన్+అన్) అని విభ క్తిప్రత్యయములుగా గ్రహింపఁ బడుచున్న యివ న్నియు నీ “అస్" శబ్ద మంతమందు గలవగుట చేతనే నకా రాంతములగుట ద్రుతప్రకృతికములగుట తటస్థించినది గాని వీని కజూది శబ్దములు పరమైనపుడు “న” కార ముచ్చారణ సౌకర్యమునకై వచ్చి చేరుట లేదు. మా+ఇల్లు, 'మాయిల్లు’ అన్నపుడు పరమందలి ఇకారమును బట్టి “య” అనునది సంధ్యక్షరముగాఁ జేయుచున్నట్లే, తిన్నఁగా నేగెను అను దానిని తిన్నఁగా + ఏగెను అని విడఁదీసినపుడు నడుమనగ పడు “న” కారము పై సందర్భమున “య” కారము వచ్చిన స్థానముననే వచ్చినట్లగ పడును గావున, దానివలెనే యిదీయు నుచ్చారణసౌకర్యమునకై వచ్చినదే యని కాల్డ్వెల్ తలంచి యుండును.

నామవిభ కీర్తలలోని “చేతన్" మొదలగునవి కొన్ని అనే అనునది చేర్పఁబడుటచేతనే ద్రుతప్రకృతికము లయ్యెనని చెప్పఁబడియెఁగదా. ఇక షష్ఠీ. ప్రత్యయముగాఁ దెనుఁగున గ్రహీంపఁబడుచున్న 'కు'అనునది. ద్రుత ప్రకృతిక మెట్లయ్యెనో, తెలిసికొనవలసి యున్నది.. 'కి అనునది, ""కు" అనుదాని రూపాంతరమే. ఇకారాంత ప్రాతిపదికల పైఁ జేర్పఁబడినప్పుడు +