Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

268

సంధి

కారణముగా లోపించినను అజాదిశబ్దములు పరమైనపుడు నిలుచుచునే యుండెను. నిలిచియున్నప్పు డది యుచ్చారణ సౌకర్యమునకుగా నడుమఁ జేరిన ఫ్రెంచఁబడుటయు సంభవించి నది, కాల్డ్వెల్ పండితుఁడు ద్రుతనకార మీ భాషయందు సంహితలోఁ బ్రకృతిభావమును దొలఁగించి, యుచ్చారణ సౌకర్యమును బెంపొందించుటకు గాఁ జేర్పఁబడు వర్ణములలో నొక దానినిగాఁ దలంచియున్నాఁడు. సాధారణముగా రెండచ్చులనడుమ .నుచ్చారణ సౌకర్యమునకుఁగా నంతస్థ వర్ణ ములును, సులభముగ నుచ్చరింపఁదగినవియు నగు యకార వకారములు, ఇ, ఈ, ఎ, ఏ లపైనీ, ఉ, ఊ, ఒ, ఓ లపైని (ఒకప్పుడు అకారముపైని గూడ) వరుసగా సంధ్యక్షర ములుగా (glides) వచ్చుననుట యుచ్చారణ పరిపాటిని బట్టియు, వాని సావర్ణ్యమును బట్టియు సమంజసమై కన్పట్టు నేగాని, రెండచ్చుల నడుమ వానిలో నే దానికి నెట్టి సంబం ధమును లేని దంత్య సకార ముచ్చారణ సౌకర్యమునకై వచ్చిన దనుట యెంతమాత్రము యుక్తియు క్తము కాదు. కావున నిది . సహజముగ శబ్దగతమో లేదా యొక శబ్దము తుదిఁ జేర్పఁబడిన మఱియొక దాని యవశిష్ట భాగమో యై యుండ వలయును. తిన్నగా + ఏగెను = తిన్నగో+స్ + ఏగెను తిన్నగానేగెను అను దానిలోని “న” కారమును, వైయా: కరణ లాగమములని చెప్పిన పాద + ఇల్లు = పొద + ర్ + ఇల్లు = పొదరిల్లు, సుంధరురాలు అను సందర్భములందలి శేషమును, ట