Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కళా ద్రుతప్రకృతిక విభాగము

267

మగుటచే నీ భాషలోని పెక్కు శబ్దము లుకారాంతములగుట తటస్థించినది. సంస్కృత హుంతశబ్దములు నింక వన్యభాషా పదములు గూడ నిట్టి మార్పునే పొందియుండుటం జేసి యీ భాషలో నీ యలవాడెంత బలవత్తరమై యుండెనో వ్యక్తం బగుచునే యున్నది. (ఉదా: వాక్-వాక్కు, అప్ -అప్పు, సంపత్ --సంపత్తు, కణ్ కన్ను, పల్- పల్లు, విన్-విన్ను, - మణ్-మన్ను, రోడ్ -రోడ్డు, మొ॥) ఇట్లాంధ్ర మజంతభాష యైనదని చెప్పవచ్చును. కాని సామాన్యముగా శబ్దముల తుది హల్లులపైఁ జేరిన ఉకార మా హల్లులతోఁ గలిసి శబ్దభాగమే కాఁజొచ్చినను, విభక్తి క్రియావ్యయాదులలోఁ గొన్నిటిఁ జేరిన అస్, ఉస్', 'మొదలగువాని యవశిష్ట భాగమగు నకార ముపై వచ్చిన యుకారము తఱచుగా లోపించుచుండుటం జేసి యట్టి పదములు నకారాంతములై.. భాషలో నిలిచి, యుండుట తటస్థించినది. ఈ నకారము మఱియొక శబ్దము యొక్క యవశిష్టభాగ మేయైనను దాని మూలార్ధము భాషలో విస్మృతప్రాయ మగుటచేతను, లేదా యది రూపాంతరమును బొంది గుర్తుపట్ట. వీలు లేకుండుట చేతను, అది శబ్దాంతమున నున్నను లేకున్నను శబ్దార్థమందు భేదమేమియుఁ గలుగక సులభముగ . జాఱవిడువఁబడుచుండుటచే నది ద్రుతమనియు నిధి యంత్రమందుఁ గల శబ్దములు ద్రుతప్రకృతికము లనియుఁ జెప్పఁబడుచున్నవి. ద్రుతమనఁగా ద్రవించిపోవునది. -ఖాజీపోవునది. అవసానంబున నిది యుచ్చారణలాఘవము