38]
సరఖా దేశసంధి
257
బట్టి చూడఁగా వర్గానునాసికముతోఁ గూడిన రూపమునకే ప్రాచుర్యము గలదనియు ననుస్వార సహితరూప మర్వాచీన మనియు తోఁపక పోదు.
ప్రాచీనశాసనాదులలోని వ్రాఁతనుబట్టి చూడఁగా నీ యను స్వారములు, పూర్ణార్ణానుస్వారములు రెండును మిగుల సర్వా చీన కాలమున వ్యవహారములోనికి వచ్చిన ననియు, నిప్పుడు బిందుసహితములగు శబ్దము లనేకములు ప్రాచీన కాలమున వర్గానునాసికములతోఁ గూడియే యున్నవనియుఁ దెలియ వచ్చుచున్నది. “ప్రాచీనాంధ్ర శాసనములను బరీక్షించినచో, అనుస్వారము అరుదుగను, అనునాసికములు బహుళముగను గాననగును. పూర్వకాలపు తెలుఁగు పదములయందలి హల్ రూపములైన యమునాసికములే నేఁటి తెలుఁగు పదములలో ననుస్వారములుగ మాతెనని తలంపవచ్చును.” (ప్రాచీనాంధ్ర భాషాస్వరూపము - రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక.)
ఉదా : డఙ్కలపూణ్ణి, జరిపిఞ్చువారు, మలికున్దు, నన్దగిరి, సమ్పన్నుణ్ణు.
కొంత కాలమున కీ భాషలో ననునాసిక స్థానమున సంస్కృత సంప్రదాయానుసారముగా ననుస్వారము వచ్చి.
1. మరువురఁ బేలఁగునూ, తంగమునకు మిగిలి యడవి దరికొను కార్చిచ్చుం గడచి యచటి బలములు' ద్రోణపర్వము.. 2. అంబేదవు గాక నను చెం, తంజేరఁగ నీక యెంత తగ్గిన మిరియాలుa' జొన్నల సరిగావే" 8. చండాంశుప్రభ చిక్కికుం డక్క0% హరివంశము.