254
సంధి
దగిన నిదర్శనము లిదివరకే చూపఁబడినవి. కావున 'పూచెన్' అను హలంతశబ్దముపై “కలువలు" అను శబ్దము నిలిచి నపుడు, ఏ సూత్రవిధానము నక్కఱలేకయే నకార కకారము లకు సంశ్లేషము గలిగి “పూచెన్గలువలు" అనురూపము సహజముగనే యేర్పడుచున్నది. ఈ రూపముకూడ వ్యవ హారపరిపాటిని బట్టి చూచినను భాషాసంప్రదాయమునుబట్టి స్థిరపడు నవకాశ మగపడదు. చూచినను నకారము వర్గానునాసికముగ మాఱి “పూచెఙ్గలువలు”. అనురూపమే సిద్ధమై యుండుట సహజము, తమిళమున సాధారణముగా వర్గానునాసికమే వ్రాయఁబడుచుండును. “చెస్ (0) గలువ” అను శబ్ద ముచ్చారణలో “చెఙ్గలువ” యనియే వ్యవహరింపఁ బడుట సర్వవిదితమే. సంస్కృతమున హల్ పరమైనపుడు పదాంత మకారము మాత్రమే యనుస్వార మగుచున్నది. ప్రాకృతాదులందు వలెనే యీ భాషలో గూడ వర్గాను నాసికము లనుస్వారములగుట తటస్థించి యుండును. ఇట్లు "ప్పూ చెఙ్గలువలు" "పూచెంగలువలు” ఐనది. అనునాసిక స్థానీయమగు నీ యనుస్వార మూఁదఁబడని యప్పు డా డా స్థితిని దెలుపుట కై యర్ధబిందు వ్యవహార మాచరణలోనికి వచ్చి యుండును. ఇప్పటికీని తమిళమునందును, తెలుఁగున వ్రాయబడిన వెనుకటి తాటా తాటాకు వ్రాతప్రతులయందును . “పూ చెఙ్గలువలు” “వాణ్ణు - వీణ్ణు పొడ్డు" అను రీతిని వర్గాను నాసికములతోఁ గూడిన రూపములే విశేషముగాఁ గానవచ్చు .