Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సరళాదేశ సంధి

253

బహుళగ్రహణముచే “నడు బెను, కెమ్ముగిల్” మొదలగు చోటుల నా దేశము రాలేదు. ఇట్టి వీ ద్రావిడ భాషలో బహు ళముగనే గలుగుచున్నను “తల్లిదండ్రులు" మొదలగు రూప ములవలె సంస్కృతమందు “మా తాళితకా "పాణినాదం" "తత్ భలం" మొదలగు రూపములే యేర్పడుట కవకాశము లేదు. గావున నిది యీ భాషలలోని సహజసంప్రదాయము లలోఁ గల భేదమునే సూచించుచున్న దనవచ్చును.

సరళా దేశసంధి :—అనునాసిక మంతమందు లేని శబ్ద ములపై అనఁగాఁ గళలపైఁ బరుపాక్షరములు బహుళముగా 'గసడదవ' లగుచుండ ననునాసికాంత శబ్దములపై వచ్చు పరుషములు సరళంబగు ననునాసిక ధ్వనితోడి సాంగత్య బలమువలన నిత్యముగా సరళవర్ణము లగుచున్నవి. పూచెను + కలువలు = పూచెను గలువలు: అని యుండఁగాఁ దుదిమున్న నుకారమునకు బిందు సంశ్లేషములు విభాష నగునని సూత్ర కారుఁడు తెలుపుచున్నాఁడు అనఁగా "పూచెను గలునలు". “పూఁచెఁగలువలు” “పూచెంగలువలు” “పూచెన్గలువలు” అను రూపములుకూడ నీ భాషలో నున్న వనుట. "పూచెను” అను నుత్వవిశిష్టరూపమే యిప్పుడు భాషలోఁ బ్రసిద్ధమై యుండుటచే, దీనినే తొలి రూపముగా గ్రహించి దీనిలోని తుది యుకారము లోపించుటచే సంశ్లేషము కలుగుచున్న దని వైయాకరణులు తలంచుట సంభవించినది. కాని యీ భాష లలో నజంతరూపమే యర్వాచీనరూపమై యుండుననుటకుఁ