Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆదేశ సంధి

245

మేర్పడుచున్నది. ఆ భాషలో స్థానమునుబట్టియే పరుష సరళ భేద మేర్పడుచుండుటంబట్టి వర్గ ప్రథమాక్షరము, చరమాక్షర మునుమాత్రమే వర్ణమాలలోఁ జేరినవి.

ఇంతకు ననునాసికముపైఁ గలుగు సరళవర్ణోచ్చారణ మునకును, బడమధ్యమున నజ్మధ్యస్థం బగు పరుష వర్ణము యొక్క సరళోచ్చారణమునకును లేదా లఘుతలోచ్చారణ మునకును గొంత భేదమున్న దని మనము బాగుగా గుర్తింప వలసియున్నది. పకల్-సక్స్టైల్; పాతం-పాత్రం; పేచు పేళు; పాపం—పావం,—అని పదమధ్యస్థ పరుషముల నూమ్మలుగానో, లఘుతరవర్ణములుగనో పలుకునట్టి ప్రాచీనసంప్రదాయమే యీ గసడదవాదేశ సంధికి మూలమని చెప్పవచ్చును. ఇట్టి మార్పు దేశ్యశబ్దములలోఁ గలుగుటయే సహజము. తెలుఁ గుల మీఁది సాంస్కృతిక పరుషముల విషయమునఁ గలుగదని యిటీవలి వైయాకరణులు చెప్పిరి. కాని యట్టివి ప్రాచీన శాసనములలోను, భారతాదులలోను గనఁబడుచునే యున్నవి. అవి ప్రాచీన దేశీయ సంప్రదాయానుసారములే యగున్ను సంస్కృత వర్ణ సమామ్నాయమున పరుష సరళ భేదము పద మందలి యా యా వర్ణముల స్థానమును బట్టి యేర్పడినదిగాళ్ల సహజమై యుండుటనుబట్టి పరుపొది శబ్దము సమాస మధ్య గతమైనంత మాత్రమున సరళముగా నుచ్చరింపఁబడుట తటస్థింపదు. "వాడు + కంసారి” అను శబ్దములు "వాడు + గంసారి?యని యుచ్చరింపఁబడుచో నా సంస్కృతశబ్దస్వరూ