Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

244

సంధి

సేభాషలలో నొక పరుష వర్ణములకు మాత్రమే లిపిచిహ్నము లేర్పడియుండె ననియు, నిప్పటికిని తమిళ భాషలో నా ప్రాచీన సంప్రదాయమే నిలిచి యుండ, సంస్కృత భాషాసంసర్గ ప్రాబ ల్యముచే నాంధ్రకన్నడ లిపుల యందు సరళవర్ణములకుఁ గూడఁ బ్రత్యేకచిహ్నములు బయలు దేరిన వనియు నూహింపఁదగి యున్నది.

తమిళమునందును క, చ, ట, త, ప లు వర్గానునాసి కములకంటెఁ బరమైనపుడు పదమధ్యమందలి వర్ణములవలెం దేల్చి పలుకఁబడుటగాక, కేవల సరళములుగనే పలుకఁబడు చున్నవి. ఉదా_"చఙ్కం" అని వ్రాయఁబడిన శబ్దము “శఙ్గం” అనియు, మఞ్చళ్ - మజ్జళ్ అనియు, కణ్ణమ్-కణ్ణమ్ - అనియు, చా న్తమ్--శాన్దమ్ అనియు, అమ్పు- అమ్బు అనియు నుచ్చరింపఁబడు చున్నవి. ఈ భాషలో పదాది నెప్పుడును. సరళవర్ణ · ముచ్చరింపఁబడకుండినట్లే పదమధ్యమున ద్విత్వ. వర్ణమున కేగాని పరుపోచ్చారణము లేదు. అనునాసికము తరు వాత సరళవర్ణోచ్చారణమే గాని పరుషవర్ణోచ్చారణ మిటీ `వల గనఁబడదు. ఇంపు, కంపు, అంపు మొదలగు శబ్దములు . జొన్ని తెలుఁగున - కనఁబడుచున్నను నిట్టివి తమిళమున లేవ నియే చెప్పఁదగును. . .ఇంపు- తెలుఁగులోనే ఇంబు, ఇమ్ము కూడ నై నది. కావున ననునాసికముపైఁ బరుషవర్ణిచ్చార ణము గాని, పదాదిని సరళవర్ణోచ్చారణము గాని ప్రాచీన ద్రావిడ భాషాసంప్రదాయము ధని చెప్పుట కవకాశ