Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆగమ సంధి

237

దెబ్బ” అనుదానిని “కాలిపుండు" అన్నట్లుగనే ప్రత్యేక ముగాఁ బ్రయోగించుచునే యున్నాము. “తోడ మాటాడ కునికి” అనుచో తోడ శబ్దమునకు విభక్తి ప్రత్యయముగాఁ గాక న్య ప్తముగఁగూడ ప్రయోగము గలదనుట సుప్రసిద్ధమే. ఆ వలనికిఁ బోయి యని, వలకు శబ్దమునకుఁ గూడ ప్రత్యేక ప్రయోగము కలదు. సంబంధార్థకమగు నీ “ఇ” కారము ఔపవిభ క్తిక ప్రత్యయములుగాఁ జెప్పఁబడిన “ఇ, టి, తి” ల లోని ఇకారమేగాని వేఱు గాదు. ఇవి యొక శబ్దమునకు మఱి యొక శబ్దమునకుఁ గల సంబంధమును సూచించుననై పూర్వ శబ్దమును విశేషణముగాఁ జేయుటకై చేర్పఁబడునవే గావున, విభ “క్త్యర్థములను సూచించు ప్రత్యయములపైఁ జేర్పఁబడె ననుటలో నర్థములేదు. కాని యిచ్చట విభక్తి ప్రత్యయము లని తలంపఁబడుచుండినవి వా స్తవముగా ప్రత్యయములు గాక స్వతంత్రపదములే యగుటచే, వీనిపై మఱియొక శబ్దము చేర్పఁబడినపుడు వీని కా. పదముతోడి సంబంధమును సూచిం చుటకుగా ఔపవిభక్తిక ఇకారమును జేర్చుట తటస్థించినది. నీ చేతి ప్రోపు - అనఁగా నీ హస్తము మూలమునఁ గలుగు సహాయ మనియే వా స్తవార్థము. వానివలని నేరము - వాని వైపునకు సంబంధించిన నేరము (& mistake on his part). నోటిమాట, ఊరివారు, నేతి చెంబు మొదలగు పదములలో. నగపడు నౌపవిభక్తిక ఇ కారాదులే సంబంధార్దకములై చేయి, తోడు మొదలగు శబ్దములపై ఁ గూడ గనపడుచున్నవి.