ఆగమసంధి
221
భాషలో నేర్పడిన పిదప, ఇంకు+ఇంకు అనియుండఁ గాఁ బాఁతాదులలోవలెఁ దొలి పదమునందలి తొలి యచ్చు మీఁది వర్ణంబులకు లోపంబును, పిదప ద్విరుక్త ఆకారాగమ మందును వచ్చి యీ రూప మేర్పడి యుండదని నిశ్చయింప వచ్చును. దీని విష్పత్తిక్రమమును సాధించుటలో నది తాత్కాలిక వ్యాకరణ మవలంబించు పద్ధతి గాని చారిత్రక పద్ధతికాదు. ఇప్పటి “ఇంకు” లో “ఱ”కారము కనఁబడ కున్నను, “ఇట్టింకు” లోఁ గనఁబడుచుండుటయే ప్రాచీన కాలమున నిదియొక ఆకారముతోఁ గూడి "ఇఱింకు" అను రూపమున నుండె ననుటకు.. నిదర్శన మగుచున్నది. కావున ఇఱింకు శబ్దములోని “ఆ” కారము ఇంకు ధాతువునకు మూలమైన, ప్రాచీనంబగు "ఇఱింకు ” ధాతువును సూచించు చిహ్నముగా గ్రహింపఁదగును.
ఇల్లిగ్గులు ఇది ఇగ్గులు+ఇగ్గులు అను శబ్దములు కూడికచే నేర్పడినదని శబ్దరత్నాకరము చెప్పుచున్నది. " మిక్కిలి వెనుక కొఱగుటలు " అని దాని యర్థము. (శబ్దరత్నాకరము.)
లొల్లియగు వగల త్రొక్కున
నిల్లిగులు గాఁగవచ్చు హృదయములో నక్
మల్లామడియగు మదనుఁడు
మెల్లన గూర్చుండెఁ దాల్మి మినుమినుక నఁగన్.??
ఉ. హరి. 5. ఆ.