ఆగమసంధి
219
ధాతువునకు సంకుచితత్వ మర్థము ; ఒదిఁగి యుండుట—ఒత్తుడు పడుట అనియును గలదు. ఇట్లొదిగి, ఒత్తుడుపడి యుండి యత్యల్పస్థల మాక్రమించి తుదకా స్థలమున లీనమై రూపు మాసిపోవుటయే “యింకుట" అగుచున్నది. కావున ఇఱుకు, ఇంకులకు అర్థసంబంధము కలదు. ఇఱుకు ధాత్వర్థ భావము... మఱికొంత ఇఱకట మెక్కు వయై - “ఇంకు” ధాత్వర్థమైనది. విశేషముగా ననఁగా రూపుమాసిపోవు నంతగా ఇఱుసుకొని పోవుటయే ఇంకిపోవుట. "ఇంకు” ధాతువు సామాన్యముగా నీరియుట, ద్రవపదార్థము “ఇంకిపోవుట” అను నర్థములో నే వాడుకలో నున్నను, ఇఱ్ఱంకు అను రూపమునుబట్టి "ఇఱుకు కొనిపోవుట” అను నర్థమునఁగూడ భాషలోఁ బ్రయోగింపఁ బడియున్న ట్లగపడుచున్నది. ఇట్లు. “ఇంకు” ధాతువు యొక్క పూర్వస్వరూపమునే గాక తొలి యర్థమునుగూడ నీ శబ్దము మనకు సూచించుచున్నదివలెనే యున్నది. భాషలో నీ శబ్దము ప్రయోగింపఁబడిన
"ఎవ్వడు వింధ్యాద్రి. వీటిని చూతము. వింధ్యాద్రి నిట్టింకు లింకించె? నను శ్రీనాధుని భీమేశ్వరపురాణ మందలి ప్రయోగమున విం ధ్యాద్రి నిజ్జింకు లింకించుట యనఁగాఁ గ్రిందికి, భూమిలోనికి నిఱుకుకొని పోవునట్లుగాఁ జేయుట - అణఁచివేయుట అనియే యర్థము.
"మంకెనపువ్వుమీఁది యళీమాడ్కి, నృపాధర పల్లవాధరా లంకృతియైన దంతపదలాంఛనముం గని కన్నుఁగోవల