Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

218

సంధి

యుండుట అను సర్థమున వ్యవహారములో నున్నది. తమిళము నందలి “అఱుత్తు" అను సకర్మరూపమునకు అకర అకర్మరూపము "అఱుందు" అని కలదు. దీనియర్థము (to press) గట్టిగా గలియుట, బిగియుట. ఈ "అఱుందు” అనుదానికంటే "కు” వర్ణాంతరూపము భాషలోఁ దరువాతిది కావచ్చును. కావున "అఱుందు + అదుకు= అందు + అదుకు = అందదుకు" అను +రూపము సిద్ధించును. దీనినిబట్టి వీని కన్నింటికిని మూల మగు ప్రాచీన ధాతువు "అఱు" అనియు, దానికి “అఱుందు, అందు” అను రూపములు ప్రాచీనకాలమున గలవనియు నీ సమాసమందలి తొలిరూప మద్దానిని సూచించుచున్నద నియుఁ దలంపవలసియున్నది.

ఇట్టింకులు :——ఇదియు మిగులఁ బ్రాచీనకాలమున నేర్పడిన దే కాని "ఇంగు+ఇంకు" అను శబ్దముల కూడిక మాత్రముచేతనే యేర్పడినదై యుండదు. ఇంకు + ఇంకు శబ్దములే కూడినచో మొదటి పదములోని "కు” అను వర్ల మునకుబదులు ఱ్ఱ కారాగమము వచ్చుటకుఁ గారణమేమియుఁ గనఁబడదు. లకు, అ గా మాఱినదనుట కవకాశమే లేదు గదా: కావున మొదట నీ శబ్దములోనే "ఆ" కారముండి యుండవలయును. "ఇఱుకు" అను శబ్దమునకును సాత్సం బంధమిప్పు డగ పడుట లేదు. కాని పరిశీలించినచో నీ రెండు నొక్క టే యని మనము గుర్తింపలేకపోము. వీని యర్థమునఁ గూడఁ గొంత పోలీక, సంబంధము లేకపోలేదు. "ఇఱుకు”