28]
ఆగమసంధి
217
ప్రయోగంబుగ గ్రాహ్యంబులు” అని వైయాకరణులు చెప్పి. యున్నారు. అనఁగా నివి భాషలో మిగులఁ బ్రాచీనరూపము లగుటచే వీనియందలి భాగములను విడఁగొట్టి చూపుటకు వైయాకరణులకు సాధ్యము కాలేదన్నమాట. “అందదుకు”. శబ్దమును గ్రహింతము. నాడు+నాడు. అని ద్విరుక్తి కలిగి నపుడు మొదటి పదము నంత్యాక్షరమునకు లోపము వచ్చిన దని చెప్పినట్లుగా “అందదుకు” శబ్దములోని తొలి “అదుకు” శబ్దము తుదివర్ణము లోపించినదని తలంచినచో అదుకు + అదుకు “అదదుకు” అని కావలసిన దేగాని అందదు కెట్లయి చెప్పుట కవకాశము కలుగుట లేదు. “అదుకు+అదుకు” అందదుకు ఎట్లయినదో తెలిసుకోనుటకుఁగా దీని ప్రాచీన స్వరూపము . నితర భాషలలోఁ గొంతవఱ కన్వేషించి చూడ వలసి యున్నది. కన్నడ భాషలో "అతుకు" అను శబ్దము, తెలుఁగునందలి యర్థముననే కలదు. “అదుకు, ఆతికు అనియు రూపాంతరములు కలవు. తెలుఁగునందువలె కన్న డమునందును “కు” వర్ణ విరహితమగు "అత్తు"" అను రూపొం.. తరము నొకటి కలదు. ఈ 'అత్తు' అనునది “అఱు” ధాతువు. యొక్క భూతార్థక విశ్లేషణముగాఁ గనఁబడుచున్నది. ' “అఱు+తు== అఱుతు, అలుత్తు?" "అత్తు"". తమిళమునఁ గూడు “అఱుత్తు" అనుదానికి దృధీకరణము — గట్టిగా.. నొత్తుట, (to press). అను. నర్థము కలదు. తెనుఁగునం అత్తు", అనునది . అత్తుకొనుట = ఒక దానితో నొకటి అత్తి కలిపి),