Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

216

సంధి

కాలమున భాషలో బయలు దేరిన రూపము కావచ్చును. ఊరూరు, అక్కడక్కడ, అను పదబంధము లేర్పడిన పిదపనే వీనిపై విభక్తి ప్రత్యయములు చేర్పఁబడి, “ఊరూరన్” “అక్కడక్కడకు" అను రూపము లేర్పడియుండు ననియుఁ దలంపనగును. "ఇంటింటన్" అనునది మాత్ర మాపవిభ కాంతనుగుట చే "ఇంటన్ + ఇంటన్" అని యుండఁగా నుచ్చా రణ వేగమున సంధి జరిగినదని చెప్పక తప్పదు. ఇల్లిల్లు రూపముకూడ భాషలోఁ బ్రసిద్ధమై వ్యవహారమునఁ గలదు. (ఉదా:-గోకుల మిల్లులు దప్పకుండ లక్ష్మీతతి గ్రుమ్మ భాగ.) “ఇంచించుక” “నానాడు” శబ్దములలో శబ్దాంత్య భాగ ములే లోపించినవి. నాడు, నాడు కలసి యొక్క పదమైనపుడు. రెండవ పదస్వరూపము మొదటిదానిని గూడ స్ఫురింపఁ జేయు చునే యుండును. మరియు నొక పదమునందలి తొలి యక్ష నముపై స్వరమూఁదినపుడు. తరువాతి యక్షరములు తేల్చి పలుకఁబడుటచే నది మఱియొక పదముతోఁ జేరినపు డవి క్రమముగా లోపించుచుండును. మొత్తముమీఁద నీ శబ్దములు ఇంచుక+ఇంచుక, నాడు + నాడు అను సంపూర్ణ శబ్దములు కలసి యుచ్ఛారణ వేగముచేఁ బూర్వ శబ్దాంత్యాక్షరము : జాఱవిడవఁబడుటచే నేర్పడినవనియే తోఁచుచున్నది.

అందదుకు ప్రభృతులు:—కాని "యందదుకు” తులు మాత్ర మిట్టివని తలంచుట కవకాశ మగపడదు. కావు ననే వాని రూపనిష్ప త్తిక్రమమును గూర్చి