Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆగమసంధి

215

స్థానమున వచ్చిన ద్విరుక్తటకార మా శబ్దములో రెండన యక్షరము లేదా తొలియచ్చుమీఁది వర్ణంబైనది. కావున వీని సాదృశ్యముచే “చివర, పగలు, బయలు" మొదలగు మూఁడక్షరముల శబ్దములలోఁగూడఁ డొలియచ్చు మీఁది వర్ణంబుల నన్నిటిని లోపింపఁ జేసి వాని యన్నిటి స్థానమునను "ట్ట" వర్ణమును నిలిపిరి. “కట్టకడ” “నట్టనడుమ" అని చెప్పు చున్నాముగదా! (బయలు బయలు) బట్టబయలు, పట్టపగలు, చిట్టచివర అని యెందుకుఁ జెప్పఁగూడదను భావముతోఁ బై వాని సాదృశ్యమునుబట్టి జనులు వ్యవహరించుటచే నేర్పడి న వేగాని వాస్తవముగా వీనిలో ద్విరుక్త టకారము వచ్చుట కవకాశమే లేదు. కాబట్టి 'కట్టకడ' 'నట్టనడుమ'. ఆను రూపములలో కడు, సడు శబ్దములనుబట్టి ద్విరుక్తటకారము సహజముగా వచ్చినదనియుఁ దక్కినవానిలో నిది సహజము 'కాదనియుఁ గావుననే సాదృశ్యఙ (Analogical) మరియు -నిశ్చయింపఁ దగియున్నది.

'ఆమ్రేడితము పరమగునపుడు గలుగు విభక్తిలోప ముచ్చారణ వేగమునఁ గలుగవచ్చును. తుది శబ్దమునందలి విభక్తియే యా సమాసగతమగు మొదటి శబ్దమునకు నా సమాసములోని యితర శబ్దములకు గల సంబంధమును వ్యక్తము చేయచునే యుండును. గావున వచ్చట. విభక్తి ప్రత్యయ ముండినఁగాని యర్థమునకు భంగము కలుగు నను భయము లేదు. " "అప్పటి కప్పటికీన్" అనునది. తరువాతి