Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆగమసంధి

213

భాషలో వ్యవహారమున నుండుటచేఁ బ్రాచీన కాలమున కొమకు శబ్దమున కే “ఆలు” శబ్దమును జేర్పఁగా "కొమరాలు” రూపము భాషలో నేర్పడిన దనుటకు సందేహము లేదు. ఇట్టి శబ్దముల సామ్యముచేతనే ప్రాచీనకాలమున మనుమరాలు మొదలగు దేశ్యరూపములును, జవరాలు ముద్దరాలు మొద లగు తద్భవరూపములు నేర్పడియుండును. భాషలోఁ బ్రాచీ నములని తలంపదగిన యాచ్ఛికశబ్దములపై "అలు” శబ్దము పరమైనపుడే కొన్ని ప్రాచీనసమాసముల సామ్యముచే "రేఫా దేశము కలిగి 'మనుమరాలు, గొడ్డురాలు, జవరాలు' మొద లగు రూపము లేర్పడినపుడు వానికంటె నిర్వాచీనములని తలంపఁదగిన తత్సమ శబ్దముల కాలు శబ్దము పరమైనపుడు “రు”గాగమంబగుటలో అభ్యంతరమేమి? కావున గుణవంతు రాలు; ధీరురాలు మొదలగు రూపములు కూడ పై రూపముల సామ్యముచే భాషలో నేర్పడుట తటస్థించిన వనవచ్చును.

ఈ భాషలో సామ్యమున నేర్పడినవని చెప్పఁదగిన శబ్దములలో ద్విరుక్త టకారముతోఁ గూడినవి కొన్ని కలవు. ఇవి యా మ్రేడిత సంధికి సంబంధించినవి. సామాన్యముగా కృశార్థమును సూచించుటకు శబ్దమును రెండుమాఱు లుచ్చ రించుట స్వాభావికమై కనఁబడుచున్నది. సంస్కృతాది ఇండో-యూరపియన్ భాషలలోను ఇట్లు చెప్పుట కలదు. మండం మంధం, బోభూయతే, జంగమ జంగమ్య తే, మొదలగు రూపము పములు శబ్దముల ద్విరు క్తివలన నేర్పడిన వే.