Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

212

సంధి

రుగాగమము :-కర్మధారయమందు పేదాది శబ్ద ముల కాలుశబ్దము పరమగునపుడు రుగాగమం బగుచున్నది; అనఁగా పేద + ఆలు అను నీ రెండు శబ్దంబులు గలిసి యొక సమాస మయినప్పుడు వాని మధ్య నొక రేఫము చేరుచున్న దనుట, పేద + ఆలు = పేదాలు అని కావలసియుండఁగా “పేదరాలు' అయినది. ఇచ్చట రేఫాగమమునకుఁ బ్రసక్తి కానఁబడదు. వెనుకటి సమాసంబులలోని “టు” గాగమము “అత్తు” శబ్దమునకు సంబంధించినదని చెప్పినట్లే యీ రేఫము సంబంధార్థమునఁ జేర్పఁబడిన యొక శబ్దముయొక్క యవశిష్ట భోగ మని చెప్పుటకైన నవకాశమేమియుఁ గనఁపడదు. ఇది “పేదవారు”అను బహువచనశబ్దరూపాంతర మగు “ పేదరు” శబ్దమునకు ఆలు శబ్దముఁ జేర్పఁగా నేర్పడిన రూపమై యుండ వచ్చును. తమిళమున పేదవాండ్రు అను సర్థమున 'పేదయర్ అను బహువచనరూపము కలదు. కావున “పేదరు + ఆలు పేదరాలు అయి యుండవలెను.

ఇంక కొమరాలు అను శబ్ద మొకటి కలదు. దానిని నైయాకరణులు కొమ+అలు అని విడదీసి, నడుమ రుగా గమము వచ్చుటచే కొమ+ర్ + ఆలు = గోమరాలు ఐనదని చెప్పుదురు. కాని ప్రాచీనభాషను . తరువాతి కాలపు నైయా కరణులు వ్యాకరించునపు డొర్కోకచోట ననుచితవి భాగము సంభవించుచుండు ననుట వచ్చును. ఏలయనఁగాఁ "గొమరు" అను శబ్దమే వ్య స్తముగా క దృష్టాంతముగా..