ఆగమసంధి
207
గల రెండు పదములతోఁ జేయఁబడిన సమాసముగదా, కఱకు + అమ్ము, నిగ్గు + అద్దము అని యుండఁగా సహజముగ స్థానబలముచేతనే వానిలో మొదటిది రెండవడానికి విశే క్షణమై నిలిచియుండినను, దాని విశేషణత్వమును మఱింత సువ్యక్తము చేయవలయు నను భావము ప్రబలమైనపుడు భాషలో సామాన్యముగాఁ బ్రాతిపదికలపై విభక్తిసూచక ప్రత్యయములు (ఇవి వాస్తవముగా ప్రత్యేక స్వతంత్రపద ములె గాని సంస్కృతాదు అందువలె విభక్తి చిహ్నములు మాత్రముకావని యెఱుంగునది) చేర్పఁబడునపుడు నడుమ వచ్చి చేరు నిగాగమాదులవలెనే “టి" అనునది యిచ్చటఁ జేర్పఁబడినది. ఈ "టీ"లో నున్న ఇకారమే ప్రధానముగా సంబంధార్థమును దెలుపునదై రాముని *పు స్తకము, రాముని చేత మొదలగు చోటులఁ గాన వచ్చుచున్నది. కఱకు అనునది స్థానమునుబట్టియు. నర్థమును బట్టియు విశేషణమే యైనను, అర్థవ్య క్తి క్తికిఁగాను కఱకైన బాణము అని " అయిన " అను శబ్ద మిప్పుడెట్లు చేర్పఁబడుచున్నదో అట్లే 'టి' అనునదికూడ వెనుకటి కాలమునఁ జేర్పఁబడినదై యిప్పటికీని వ్యవహార ములో నున్నది. ఇది నామవాచకములను వి శేషణములుగాఁ జేయుటకై చేర్పఁబడిన స్వతంత్రశబ్దములు యవశిష్టభాగ మే యైనను, కొన్ని సందర్భములలో విశేషణవాచక శబ్దముల
- రాముని యనునప్పుడు నిగారము మూఁబడు “ని” యనుంది
"రామున్" అనందాన్నిపై సం ందార్థం "ఇ" కారము చేరుటచే రము చేరుటచే నేర్పడిన రూపములనుండి విడదీయఁబడిన భాగమై యున్నది.