Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమాస సంధి

195

అయి రెండు గకారము లొకదానివెంట నొకటి యుచ్చరిం చుటలోఁ గల చిక్కు నుబట్టి యొకటి లోపించుటచే సగం గోరుడా"సంగోరు" అయియుండును. ఒక్క యక్షరమే రెండు మారొక్క పదముననే యొకదాని వెంబడి నొకటి వచ్చినపు డుచ్చారణ సౌలభ్యము కొఱ కర్ధభంగము లేనియపు డం దొకటి లోపించు టచ్చటచ్చటఁ గలదు. ఇట్టి లోపము "ఇండోయూరపియన్ భాషలలోఁ గలిగినపు డదానిని శబ్ద శాస్త్ర వేత్తలు 'Haplology' అని నామకరణము చేసిరి. ఉదా:-“మధూ ధుఘ” = "మధుమ”, “తు వీరవవాస్ - తువీ రవాస్.” అట్లే తెలుఁగున “కంచు + చెంబు” శబ్దములు తొం దరగా నుచ్చరింపఁబడినపుడు "కం చెంబు” అనియు “ పెద్ద + తనము= పెత్తనము, వంగ+కాయ= వంకాయ' బలుకఁబడుచుండుట మన మెఱింగిన దే అనియుఁ

నివ్వెఱ దీనిని 'నిండు+వెఱ' అని వైయాకరణు లర్థమునుబట్టి విడఁదీసి యున్నారు. కాని యిది నిండులోని ద్వితీయాక్షర లోపమువలన నేర్పడినది గాదనియే చెప్ప వచ్చును. ఈ భాషలో "నిండు” ధాతు నెట్లేర్పడినదో . శీలింపవలయును. దీని పూర్వరూప మొక రేఫముతో గూడి యుండే ననుటకుఁ దమిళమున నీధాతువు నిరమ్బు (To be full) నిరప్పు (To ill) అని అకర్మక సకర్మకరూపముల వాడు. కలో నుండుటయే నిదర్శనము. నిరమ్బు అను దానికి బదులు తెలుఁగున “నిండు" అనియు, నిరప్పు అనుదానికి బదులు