Jump to content

పుట:సంధి (ఆంధ్రభాషా సంధి నియమముల చారిత్రక పరిశీలనము).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సమాస సంధి

189

గలవు. క. కెళగు రూపాంతరము. మళ. కిఱి-క్రిందికి దిగుట (To descend). తమిళమునందలి “కిఱక్కు..” అనుదాని క్రింది భాగము—నిమ్న ప్రదేశము - అని నర్థమును బట్టి తమిళ దేశ ములకు నిమ్న భాగము తూర్పుదిక్కునకు ఉన్నతభాగము- అనఁగా పశ్చిమ కనుమలు పడమర దిక్కున నున్నవి గావున "కిఱక్కు” అనఁగా తూర్పు దిక్కు అనియు, పశ్చిమ దిక్కు నకు "మెర్కు" (మీఁదిదిక్కు - ఉన్నతమైన కొండలు గల దిక్కు) అనియు సంజ్ఞ లేర్పడినవి. కాని కన్నడ మళయాళ దేశములలో నీ పదములు తమిళము నందలి దానికంటె విరు ఆ ద్ధమగు నర్థమున వ్యవహారములో నున్నవి. ఏల యనఁగా పశ్చిమ సముద్రతీర భాగముననున్న మళయాళ దేశమునకు పచ్చిమకనుమలు తూర్పుదిక్కున నున్న వగును. ఆ దేశము -నకు పశ్చిమదిక్కున సముద్రతీరమగు నిమ్న ప్రదేశముండు టచే నిమ్నార్థమగు “కిఱక్కు” శబ్ద మా దేశమున బశ్చిమ దిక్కను నర్థము నిచ్చునది. ఎత్తైన కొండ లా దేశములకుఁ దూర్పు వైపున నుండుటచే “మెర్కు" అనునది "తూర్పు” దిక్కును సూచించు పదమైనది. ఇట్లాయా దేశకాల స్థితు లనుబట్టి శబ్దముల యర్థము వాని సంకేతార్థములును మాఱు చుండుననుట కివి మంచి నిదర్శనములగుచున్నవి.

కిట్కట్టు=క్రిందికట్టు ( A lower Structure)..

కిబ్కి-డల్ = క్రింది. సముద్రము. (The western Lea)

కిట్కె బై-క్రింది చెఱువు (The lower tank)